: దెయ్యంతో స్నేహం చేస్తున్న నటి రాయ్‌లక్ష్మి... ట్వీట్‌లో వెల్లడి
`ఈమె నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను చూడటానికి ఇండియా వచ్చింది. భారత్‌కి స్వాగతం. ఇక్కడ ఆమె కచ్చితంగా ఆనందంగా ఉంటుంది` అని ట్వీట్ చేసి, నటి రాయ్ లక్ష్మి తన ప్రాణస్నేహితురాలిని అభిమానులకు పరిచయం చేసింది. ఇంతకీ తన స్నేహితురాలు ఎవరో తెలుసా? ఒక దెయ్యం బొమ్మ. ఇటీవల హాలీవుడ్‌లో వచ్చిన హార్రర్ చిత్రం `అనబెల్` కథ ఈ బొమ్మ చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రం భారత్‌లో కూడా విడుదలైంది. జనాలను ఈ బొమ్మ ఎంతలా భయపెడుతోందంటే... ఇటీవల ఈ సినిమా చూసి ఒకావిడ థియేటర్లోనే పిచ్చిగా ప్రవర్తించింది. అలాగే గతంలో వచ్చిన `కాంజూరింగ్` సినిమాల్లో కూడా ఈ బొమ్మ బాగానే భయపెట్టింది. మరి ఇలాంటి బొమ్మతో రాయ్‌లక్ష్మికి స్నేహం ఏంటని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.