: సిరియాలో అమెరికా వైమానిక దాడులు.. 19 మంది చిన్నారులు స‌హా 42 మంది పౌరుల మృతి


సిరియాలోని ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందించేందుకు అమెరికా ఆధ్వ‌ర్యంలో దాడులు కొన‌సాగుతున్నాయి. సిరియాలోని ర‌క్కా న‌గ‌రంలో జ‌రిపిన అమెరికా వైమానిక దాడుల్లో 19 మంది చిన్నారులు స‌హా 42 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని అక్క‌డి మాన‌వ హ‌క్కుల సంఘం నేత‌లు వివ‌రించారు. సిరియాలో ఐసిస్ ఉగ్ర‌వాదుల‌పై అమెరికా 2014 నుంచి దాడులు చేస్తోంది. అయితే, ఈ దాడుల్లో అమాయ‌క పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవ‌లే ఆ దేశంలోని డైర్‌ అల్‌జోర్ ప్రాంతంలో అమెరికా జరిపిన దాడుల్లో 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News