: ఇంద్రధనుస్సు చివరలు ఎలా ఉంటాయో తెలుసా?.... ఈ ఫొటో చూడండి!
వర్షాకాలంలో ఆకాశంలో విరిసే హరివిల్లు పిల్లలు, పెద్దలు అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుంది. అందరికీ దాని మధ్య భాగం మాత్రమే కనిపిస్తుంది. ఇంద్రధనుస్సు చివరి భాగాలు కనిపించిన సంఘటనలు చాలా అరుదు. కానీ ఇటీవల జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి తాను చూసిన ఇంద్రధనుస్సు ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటో చూస్తే హరివిల్లు అక్కడి నుంచే ప్రారంభమైందా? అనే భావన కలుగుతుంది. ఆ వ్యక్తి కూడా `మొదటి సారి ఇంద్రధనుస్సు చివరను చూశాను` అని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోను ఇప్పటికి 68,000 మంది రీట్వీట్ చేశారు. కొంతమంది నెటిజన్లు మాత్రం తాము కూడా ఇంద్రధనుస్సు చివరి భాగాలను చూసినట్లు పేర్కొని, వారి ఫొటోలను కూడా షేర్ చేశారు.