: పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు!
తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అదనపు శాఖలు కేటాయించారు. ఈ మేరకు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పన్నీర్ సెల్వంకు ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలు, ఎన్నికలు, పాస్ పోర్ట్స్ శాఖలను అదనంగా కేటాయించినట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఇంతకుముందు ఈ శాఖలను డి.జయకుమార్ నిర్వహించారు. జయకుమార్ కు మత్స్య శాఖతో పాటు సిబ్బంది, పరిపాలన సంస్కరణల శాఖనూ కేటాయించారు. ఇదిలా ఉండగా, పన్నీర్ సెల్వం తన వర్గాన్ని అధికారిక అన్నాడీఎంకేలో నిన్న విలీనం చేశారు. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన పాండియన్ కు మంత్రి పదవి దక్కింది. తమిళనాడు అధికార భాష, సంస్కృతి సంప్రదాయాల శాఖా మంత్రిగా పాండియన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు.