: ఏపీలో ఘోరం.. మనిషిని చంపి, మెదడు తిన్న సైకో!
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ఒళ్లు జలదరించే ఘటన చోటు చేసుకుంది. మండలంలోని పంగిడిలో మంచినీటి చెరువుకు కాపలాదారుడిగా ఉన్న చిననాగేశ్వరరావు అనే వ్యక్తిని మతి స్థిమితం లేని వ్యక్తి దారుణంగా చంపేశాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత తలను చీల్చి, మెదడును తింటూ వికృతంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన స్థానికులు మతి స్థిమితం లేని ఆ వ్యక్తిని పట్టుకుని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న చెట్టుకు కట్టేసి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.