: శిఖర్ ధావన్ కు ఇష్టమైన సినీనటులు, క్రికెటర్ ఎవరంటే...!


తనకు ఇష్టమైన బాలీవుడ్ నటి కరీనాకపూర్ అని టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ అన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధావన్ తనకు ఇష్టమైన క్రికెటర్, సినీ నటుల గురించి ప్రస్తావించాడు. తనకు ఇష్టమైన నటుడు అమీర్ ఖాన్ అని చెప్పిన శిఖర్ ధావన్... తాను ఇష్టపడే సినిమా 1976లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘రాకీ’ అని తెలిపాడు. ఈ సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశానని అన్నాడు. ఇక, ఇష్టమైన క్రికెటర్ విషయానికి వస్తే, క్రికెట్ దిగ్గజం సచిన్ అంటే తనకు ఎనలేని అభిమానమని, తన ఫేవరెట్ గ్రౌండ్ ఇంగ్లాండ్ లోని ‘లార్డ్స్’ అని చెప్పుకొచ్చాడు. కాగా, శ్రీలంక-టీమిండియా మధ్య ఇటీవల జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ 132 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

  • Loading...

More Telugu News