: పదేళ్లలో 1000కోట్లు సంపాదించడం ఎలా?


ఎవరైనా సామాన్యులు పదేళ్ల కాలంలో మహా అయితే లక్షల రూపాయలు సంపాదించగలరు. వ్యాపారం పెట్టి అదృష్టం కలసి వస్తే కోట్లు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా(40) మాత్రం పదేళ్లలో 1000కోట్లు సంపాదించాడు. అదెలా?

రైల్వే బోర్డు మెంబర్ పదవిపై ఆ శాఖా ఉన్నతాధికారి మహేష్ కుమార్ కన్నేశాడు. మంత్రిగారి మేనల్లుడు విజయ్ ను పట్టుకున్నాడు. పదికోట్లు ముట్టజెపుతానని పనిచేసి పెట్టమన్నాడు. డీల్ ఓకే. మొదటి విడతగా 90 లక్షలు పుచ్చుకుంటున్న విజయ్ సింగ్లా, ఇస్తున్న రైల్వే అధికారి మోహన్ కుమార్ ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు. ఇంకేముంది విజయ్ సింగ్లా అక్రమాల పుస్తకం తెరచుకుంది.

మంత్రి బన్సల్ చెల్లెలి కూమారుడే విజయ్ సింగ్లా. పదేళ్ల క్రితం పంజాబ్ లోని పంచకులలో ఒక అపార్ట్ మెంట్లో అద్దెకుండేవాడు. ఆ తర్వాత రూటు మార్చాడు. కలెక్షన్లు వసూలు చేయడం, మామతో పనులు చేయించుకోవడం పనిగా పెట్టుకున్నాడు. నేడు ఖరీదైన భవంతి, పలు షోరూమ్ లు, ఒక మాల్, వందల ఎకరాల భూమి ఇతడి సొంతం. ఒక ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం అయితే, రియల్టీ వ్యాపారం, జగన్ ట్యూబ్స్ అనే తయారీ కంపెనీ, చండీగఢ్ లో1000 కోట్ల విలువైన పారిశ్రామిక స్థలం విజయ్ కుటుంబం చేతుల్లో ఉన్నాయి. చండీగఢ్ లో 130 కోట్ల భూమి కూడా ఉంది.

  • Loading...

More Telugu News