: అమెరికాను తీవ్రంగా హెచ్చరించిన అఫ్ఘాన్ తాలిబన్ సంస్థ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న రాత్రి జాతినుద్దేశించి మాట్లాడుతూ ఆఫ్ఘనిస్థాన్ పై కీలక ప్రకటన చేశారు. ఆ దేశానికి మరిన్ని బలగాలను పంపుతున్నట్లు చెప్పారు. అమెరికా నుంచి సుమారు 3,900 మందికి పైగా అమెరికా మిలిటరీ సిబ్బంది ఆ దేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే, ట్రంప్ నిర్ణయంపై స్పందించిన ఉగ్రవాద సంస్థ తాలిబన్ అమెరికాను హెచ్చరించింది. అమెరికాకు అఫ్ఘాన్ ఓ శ్మశానంగా మారిపోతుందని పేర్కొంది. అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోవాలని అఫ్ఘానిస్థాన్ లోని తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఓ ప్రకటన చేశాడు. ఆఫ్ఘాన్ లో యుద్ధాన్ని కొనసాగించాలనే నిర్ణయంపై అమెరికా వెనక్కి తగ్గాలని అన్నాడు.