: తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకోనున్న హేమమాలిని కుమార్తె!


ఒకప్పటి బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర, బ్యూటీ క్వీన్ హేమమాలినిల కుమార్తె ఇషా డియోల్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది. ప్రస్తుతం గర్భవతి అయిన ఇషా డియోల్ సంప్రదాయం ప్రకారం తన భర్త భరత్ తఖ్తానీని మరోసారి వివాహం చేసుకోనుంది. వ్యాపారవేత్త, సింధి అయిన భరత్‌ తఖ్తానీని ఇషా డియోల్ 2012లో ఇస్కాన్ టెంపుల్ లో వివాహం చేసుకుంది.

అప్పుడు సింధీల సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేసిన ఈ జంట ఇప్పుడు మరోసారి మూడడుగులు వేయనుంది. సింధీల సంప్రదాయంలో జరిగే ఈ తంతును ‘గోధ్‌ భరాయ్‌’ అంటారు. మరో రెండు నెలల్లో ఇషా తల్లి కాబోతోంది. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఇషా ధరించే దుస్తులను ఆమె వివాహ దుస్తులకు డిజైనర్ గా వ్యవహరించిన నీతా లుల్లా తయరుచేయనున్నారు. 

  • Loading...

More Telugu News