: 'చంద్రబాబు చేసిన ప్రచారం అవాస్తవం' అంటూ మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు!


నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చంద్రబాబు ఓ మహిళ ఫోటో చూపిస్తూ 'ఈమెను అత్యాచారం చేసి హత్య చేశారని' చెప్పిన సంగతి తెలిసిందే. వైకాపా నేతలు ఈ ఘటన వెనకున్నారని కూడా ఆయన ఆరోపించగా, తాను బతికే ఉన్నానని చెబుతూ సదరు మహిళ ఈ రోజు మీడియా ముందుకు వచ్చింది. చనిపోయింది తాను కాదని, వేరే అమ్మాయని చెబుతూ, పదేపదే తన చిత్రాన్ని లోకల్ చానళ్లలో చూపిస్తున్నారని బాధితురాలు షమీమ్ వాపోయింది. తన భర్తతో కలసి మీడియాతో మాట్లాడిన ఆమె, తనను బలి చేయడంపై కన్నీరు పెట్టుకుంది. తమ కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆమె కుటుంబీకులు కూడా ఆరోపించారు.

  • Loading...

More Telugu News