: మన ‘గ్యాంగ్ లీడర్’ చిరంజీవి అంటూ మెగాస్టార్ కి టాలీవుడ్ సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఈ రోజు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చిరంజీవితో తీసుకున్న ఫొటోలను ఆయన అభిమానులు ఈ రోజు తమ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు. సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, వెంకటేశ్, నాని, మంచు లక్ష్మితో పాటు మెగా హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా చిరంజీవికి హ్యాపీ బర్త్ డే చెప్పారు. చిరంజీవి సినిమాలంటే తమకు చాలా ఇష్టమని సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. చిరంజీవి మన ‘గ్యాంగ్ లీడర్’ అని విక్టరీ వెంకటేశ్ అన్నారు. తాము ఈ స్థితిలో ఉండడానికి చిరంజీవే కారకులని మెగా హీరోలు ట్వీట్ చేశారు.