: ఘోర రోడ్డు ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడ్డ యువతి... వీడియో చూడండి
స్కూటీ మీద వెళ్తున్న యువతిని అటుగా వచ్చిన మారుతి స్విఫ్ట్ డిజైర్ ఢీకొట్టడంతో యువతి గాల్లోకి ఎగిరి కింద పడింది. స్కూటీ నుజ్జునుజ్జైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. అయితే ఈ యాక్సిడెంట్‌లో ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు డాక్టర్లు తెలిపారు. తమిళనాడులోని మోహనూర్ ప్రాంతానికి చెందిన ప్రియ, తన ఇంటి నుంచి వాళ్ల కుటుంబం నిర్వహించే బేకరీకి స్కూటీ మీద బయలుదేరింది.
రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, ఆమె స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి, దూరంగా పడింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. తర్వాత దగ్గరలోని ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. కేవలం స్వల్పగాయాలు అయ్యాయని, ప్రాణానికేం ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు ప్రియ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, కారు నడుపుతున్న వ్యక్తిని నమక్కల్ ప్రాంతానికి చెందిన ఎస్.హరిహరన్‌గా పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.