: కుర్తా-పైజామాలో హాజరై... `జై హింద్` అన్న కెనడా ప్రధాని
కెనడాలోని మాంట్రియల్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జస్టిన్ త్రెదో పాల్గొన్నారు. భారత సంప్రదాయం ప్రకారం కుర్తా-పైజామా ధరించి ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. అంతేకాకుండా తన ప్రసంగం చివర్లో `జై హింద్` అని ప్రవాస భారతీయుల మనసులను గెల్చుకున్నారు. వేడుకలు నిర్వహించిన ప్రదేశం జస్టిన్ త్రెదో ఎన్నికైన నియోజకవర్గమైన పాపిన్యూ పరిధిలోనే ఉండటంతో ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారత హైకమిషనర్ వికాస్ స్వరూప్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుక అనంతరం ఆయన ఇరు దేశాల మధ్య స్నేహభావం ఎప్పటికీ కొనసాగుతుండాలని ట్వీట్ కూడా చేశారు. కెనడాలోని టొరంటో, ఒట్టావా ప్రాంతాల్లో కూడా ప్రవాస భారతీయులు స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు.