: పొలంలో కష్టపడుతున్నసీఎం కేసీఆర్: కేటీఆర్
తనకు ఎంతమాత్రం తీరిక దొరికినా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయి, అక్కడ పంట పొలాలను, తోటలను పరిశీలించే తెలంగాణ సీఎం కేసీఆర్, అక్కడే సేదదీరుతుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కేసీఆర్ పొలంలో పనిచేస్తూ, కూలీలకు సూచనలు ఇస్తున్న కొన్ని ఫొటోలను ఆయన కుమారుడు కేటీఆర్ ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. సిద్ధిపేట సమీపంలోని ఎర్రవల్లి క్షేత్రంలో పంటలను దగ్గరుండి పరిశీలిస్తున్న ఫొటోలను ట్వీట్ చేశారు. నాయకత్వం అంటే పదవులు కాదని, మరొకరిని ప్రభావితం చేయడమేనని వ్యాఖ్యానించారు. వరి చేనుతో పాటు, ఇతర పంటలను కేసీఆర్ పరిశీలిస్తున్న ఫొటోలను చూపారు. కేటీఆర్ ట్వీట్ చేసిన ఫొటోలను మీరూ చూడవచ్చు.