: 'సైసైరా... సైసైరా' అంటూ వచ్చేసిన చిరంజీవి... మోషన్ పోస్టర్ చూడండి!


చిరంజీవి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన 151వ చిత్రం 'సైరా' తొలి మోషన్ పోస్టర్ విడుదలైంది. కొణిదెల సురేఖ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ లో ఓ కోటపై ఉన్న బ్రిటీష్ జెండా తగులబడుతున్న దృశ్యాన్ని జూమౌట్ చేస్తూ రాగా, కోట పరిసరాల్లో బ్రిటీష్ సైనికుల మృతదేహాలు కుప్పలుగా పడుండగా, చేతిలో విల్లు, దనుర్బాణాలు, ఓ కత్తి ధరించిన చిరంజీవి, తన అనుచరులతో కనిపిస్తున్నారు. ఏ.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలను సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి వెనుకవైపు నుంచి కనిపిస్తుండగా, 'సైరా... సైసైరా నరసింహారెడ్డి' అని బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తోంది. 12.25కు విడుదలైన మోషన్ మోస్టర్ ను 5 నిమిషాల వ్యవధిలో సుమారు 8 వేల మందికి పైగా చూశారు. 

  • Loading...

More Telugu News