: చిరంజీవి 151... పేరు 'సైరా', ట్యాగ్ లైన్ 'నరసింహారెడ్డి'... ఫస్ట్ లుక్ ఇదిగో!


మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిరంజీవి 151వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కొణిదెల ప్రొడక్షన్స్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. నేడు మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు వైభవంగా జరుగుతుండగా, దర్శక దిగ్గజం రాజమౌళి చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది.

అయితే, ఈ పోస్టర్ లో చిరంజీవి లేరు. కాసేపట్లో టీజర్ కూడా విడుదల కానుంది. విడుదల చేసిన నిమిషాల్లోనే ఇది వందలకొద్దీ లైక్స్ ను తెచ్చుకుని నెట్టింట వైరల్ గా మారింది. కాగా, చిత్రం పేరును తొలుత అనుకున్నట్టుగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'గా కాకుండా 'సైరా' (ట్యాగ్ లైన్ నరసింహారెడ్డి) అని నిర్ణయించింది చిత్ర బృందం.

  • Loading...

More Telugu News