: రూ. 999కి ఎయిర్ ఆసియా '7 డేస్ ఆఫ్ మ్యాడ్ డీల్స్'!
లోకాస్ట్ విమాన ప్రయాణ సేవలందిస్తున్న ఎయిర్ ఆసియా, పరిమిత కాల వ్యవధిలో ఎంపిక చేసిన గమ్యస్థానాలకు రూ. 999కి టికెట్లను అందిస్తూ, '7 డేస్ ఆఫ్ మ్యాడ్ డీల్స్' పేరిట ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నెల 27 వరకూ బుకింగ్స్ చేసుకోవచ్చని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య ప్రయాణించవచ్చని, ఈ స్కీమ్ కింద పరిమిత సంఖ్యలోనే సీట్ల రిజర్వేషన్ ఉంటుందని తెలిపింది. అన్ని విమానాలకూ స్కీమ్ వర్తించబోదని తన అధికార వెబ్ సైట్ లో ఎయిర్ ఆసియా ప్రకటించింది. ఇక భువనేశ్వర్ - కోల్ కతా, బెంగళూరు - హైదరాబాద్, బెంగళూరు - కొచ్చి, ఇంపాల్ - గౌహతి, గోవా - బెంగళూరు రూట్లలో రూ. 1,099కి టికెట్లను అందిస్తున్నట్టు పేర్కొంది.