: కోదండరాం... దొంగ రెడ్డి: నాయిని ఫైర్


తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ కోదండరాంపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కోదండరాం దొంగరెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ తొత్తుగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కోదండరాం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కైన ఆయన... ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని నాయిని ఎద్దేవా చేశారు. కాగా, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని, మరో ఉద్యమానికి సిద్ధం కావాలని కోదండరాం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News