: వాట్సాప్ న్యూ ఫీచర్.... రంగుల బ్యాక్‌గ్రౌండ్‌లో స్టేటస్ అప్‌డేట్!
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. స్టేటస్ అప్‌డేట్‌లో రంగుల్లో రాయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో నచ్చిన రంగును పెట్టుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పించింది. అలాగే అక్షరాలను వివిధ ఫాంట్లలో రాసుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. అలాగే స్టేటస్‌లో వెబ్ లింక్‌లను పెట్టుకునే అవకాశం కూడా కల్పించింది. సరిగ్గా ఇలాంటి అప్‌డేట్‌నే గతేడాది ఫేస్‌బుక్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.