: ట్రంపా మజాకా.. కళ్లు జోడు పెట్టుకోకుండానే సూర్యగ్రహణాన్ని వీక్షించిన అమెరికా అధ్యక్షుడు!
సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికన్లకు కనువిందు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలసి గ్రహణాన్ని వీక్షించారు. అయితే, ఎలాంటి రక్షణ లేకుండా సూర్య గ్రహణాన్ని తిలకిస్తే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నళ్ల కళ్లజోడు కాని, నల్లటి గాజు పలక గుండా కానీ గ్రహణాన్ని వీక్షించాల్సి ఉంటుంది. అయితే, దీన్నేమీ పట్టించుకోని ట్రంప్... గ్లాసెస్ లేకుండానే గ్రహణాన్ని కాసేపు వీక్షించారు. అలా చూడకూడదంటూ పక్కనున్నవారు వారించడంతో... ఆ తర్వాత కళ్ల జోడు ధరించి గ్రహణాన్ని చూశారు. ఈ విషయం ఇప్పుడు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలోని పశ్చిమ తీరంలో ప్రారంభమైన సంపూర్ణ సూర్యగ్రహణం 14 రాష్ట్రాల గుండా సాగింది. 70 కి.మీ. ప్రాంతం పూర్తిగా చీకటిమయమైంది.