: అఖిల్ త‌దుప‌రి చిత్రం `హ‌లో!`


విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌ అక్కినేని న‌టిస్తున్న చిత్రానికి `హలో!’ అనే పేరును ఖరారు చేశారు. ఆ విషయాన్ని నాగార్జున సోమవారం ట్విట్టర్‌లో వీడియో ద్వారా తెలియజేశారు. శనివారమే అఖిల్‌ సినిమా పేరుని వూహించండి అంటూ నాగార్జున ఓ హింట్‌ని ఇచ్చాడు. ఆదివారం నాగచైతన్య కూడా తన సినిమా ‘ఏమాయ చేసావె’లోని హల్లో... అంటూ ముగిసే పాటని ట్వీట్‌ చేసి మరో హింట్‌ ఇచ్చాడు. దాంతో ‘హలో..’ పేరుతోనే సినిమా పేరు మొదలయ్యే అవకాశాలున్నాయని అర్థమైంది. ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిస్తూ నాగార్జున మ‌రో ట్వీట్ చేశారు.

`మీరంతా ఊహించింది క‌ర‌క్టే... అఖిల్ త‌దుప‌రి చిత్రం పేరు `హ‌లో`` అని చెప్పారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రాలకి రెండు అక్షరాల పేర్లే ఎక్కువగా ఉంటాయి. ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్‌ని అనుసరించినట్టు తెలుస్తోంది. నాగార్జున ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసిన వీడియోలో ఎన్టీఆర్‌, కాజల్‌, ప్రభాస్‌, శ్రుతిహాసన్‌, నాగచైతన్య, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సమంత, సూర్య, నాని, వెంకటేష్‌, రాజమౌళి, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రానా తదితరులు హలో అంటూ సినిమా పేరును ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు పాట ‘హలో హలో అమ్మాయి...’తో ఆ వీడియో పూర్తవడం విశేషం. ఈ సినిమాలో అఖిల్‌ సరసన కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తోంది. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

  • Loading...

More Telugu News