: 6 కోట్లకు పరువు నష్టం దావా వేసిన రజనీకాంత్ కుమార్తె!


సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య రూ. 6 కోట్ల పరువునష్టం కోరుతూ చైన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలో రజనీ కుటుంబం ఓ ఆశ్రమ పాఠశాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అద్దె చెల్లించలేదనే కారణంతో ఆ పాఠశాల స్థల యజమాని వెంటేశ్వర్లు గత నెల 15వ తేదీన పాఠశాలకు తాళం వేశారు. అద్దె చెల్లించని కారణంతోనే పాఠశాలను తాము అధీనంలోకి తీసుకున్నామని ఆయన మీడియాకు తెలిపారు.

ఈ నేపథ్యంలో, హద్దుమీరి పాఠశాలలోకి ప్రవేశించినందుకు కోటి రూపాయలు, తమ పాఠశాల సంఘం పేరుకు కళంకం కలిగించినందుకు రూ. 5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఐశ్వర్య తన పిటిషన్ లో కోరారు. ఇతరులు తమ పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించాలని హైకోర్టును కోరారు. శ్రీ రాఘవేంద్ర విద్యా సంఘాన్ని తాము 1991లో రిజిస్టర్ చేయించామని... ఈ సంఘం ద్వారా గిండీ, సైదాపేట, వేలచ్చేరిలో పాఠశాలలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News