: ముహూర్తం కుదిరింది...శశికళను పార్టీ నుంచి బహిష్కరించేందుకు సర్వం సిద్ధం


అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను శాశ్వతంగా బహిష్కరించేందుకు సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం పన్నీర్ సెల్వం, పళనిస్వామి పార్టీ ఎమ్యెల్యేలతో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో శశికళ, టీటీవీ దినకరన్ లను పార్టీ నుంచి బహిష్కరించనున్నారు. అయితే దీనిపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శశికళ ఏ హాని చేశారని ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసే అధికారం పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఉందని, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అని దినకరన్ వర్గం స్పష్టం చేస్తోంది. పార్టీ నుంచి జయలలిత ఆత్మతో పాటు శశికళను కూడా ఎవరూ దూరం చేయలేరని వారు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News