: నంద్యాల ముగిసింది, ఇక కాకినాడపై వైఎస్ జగన్ కన్ను!


నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న వైఎస్ జగన్, ఆ వెంటనే కాకినాడపై కన్నేశారు. ఈ నెల 29న కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రేపటి నుంచి 27వ తేదీ వరకూ జగన్ కాకినాడలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది. అధికార టీడీపీ, బీజేపీ కూటమితో వైకాపా గట్టిగా పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ పర్యటన సాగనుంది.

మొత్తం 48 డివిజన్లలో ఎన్నికలు సాగనుండగా, ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వారంలో జగన్ తో పాటు చంద్రబాబు కూడా కాకినాడలో ఉద్ధృతంగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక నంద్యాలలో నిన్నటి వరకూ ఉన్న పలువురు మంత్రులు, నేతలను అధికార తెలుగుదేశం కాకినాడకు తరలిస్తుండగా, వైకాపా కూడా పలువురు నేతలను రంగంలోకి దించుతోంది. ఆ పార్టీ తరఫున ఇప్పటికే ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తదితరులు కాకినాడలోనే మకాం వేసి ప్రచార సరళిని పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News