: షారూఖ్, సల్మాన్, నేను.. మేమే స్టార్సా?.. ఇదేం బాలేదు!: ఆమిర్ ఖాన్


బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ సహా తనను స్టార్ గా పిలుస్తుండడాన్ని మరో స్టార్ ఆమిర్ ఖాన్ ఆక్షేపించాడు. బాలీవుడ్‌లో తాము మాత్రమే స్టార్లం కాదని, అలా పిలవడం సరికాదని పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో నైపుణ్యం ఉన్న ఎందరో స్టార్లు ఉన్నారని, వారు తమ నటనతో ఎంతో పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నారని వివరించాడు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్‌ను ఉదహరించాడు.

 ‘‘షారూఖ్, సల్మాన్, ఆమిర్ అంటూ ప్రతిసారీ వీరే స్టార్లు అంటూ ప్రస్తావించడం బాగాలేదు. సరికాదు కూడా. ఇండస్ట్రీలో బోలెడంత మంది స్టార్లు ఉన్నారు. వారు కూడా చాలా పాప్యులర్. అక్షయ్ కుమార్ తాజాగా నటించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథా’ చిత్రం బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు దానికి బ్రహ్మరథం  పడుతున్నారు’’ అని ఆమిర్ పేర్కొన్నాడు.

కాగా, ఇటీవల షారూఖ్, సల్మాన్ నటించిన జబ్ హారీ మెట్ సేజల్, ట్యూబ్‌లైట్ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఎంతటి నటుడికైనా ఎత్తుపల్లాలు సహజమేనని పేర్కొన్న ఆమిర్, ప్రజలు మెచ్చేలా కష్టించి పనిచేయాలన్నాడు. త్వరలో రానున్న తన సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ పాట విడుదల సందర్భంగా ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News