: భారత వైమానిక దళానికి మరో 36 రాఫెల్ యుద్ధ విమానాలు


భారత వైమానిక దళం కోసం ఫ్రాన్స్‌ నుంచి 36 రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నౌకాదళానికి కూడా మరో 56 యుద్ధ విమానాలు అవసరమని రక్షణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో కేవలం 36 యుద్ధ విమానాల తయారీ అయితే భారత్ లో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని, మరిన్ని ఆర్డరిస్తే కనుక భారత్ లో యూనిట్ పెట్టి, వాటిని ఇక్కడే తయారు చేస్తామని రెండు సంస్థలు ముందుకొచ్చాయి.

పొరుగుదేశాలతో పెరుగుతున్న సమస్యల నేపథ్యంలో రక్షణ విభాగాన్ని మరింత పటిష్ఠపరచాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో మరో 36 యుద్ధ విమానాల కొనుగోలుకు త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో సంస్థను ఏర్పాటు చేసి, తయారు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇడియన్ నేవీ ఎఫ్‌-18, రాఫేల్‌ యుద్ధవిమానాలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. 

  • Loading...

More Telugu News