: గీతం ప్రొఫెసర్ శరత్ చంద్రబాబుకు అరుదైన గౌరవం.. టోక్యోలో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగానికి ఆహ్వానం!


గీతం విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు.. జపాన్‌ నుంచి అరుదైన ఆహ్వానాన్ని అందుకున్నారు. ఈ నెల 27 నుంచి టోక్యోలో 'అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్'పై జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందినట్టు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది.

‘కార్బన్ బేస్డ్ నానో మెటీరియల్స్ అండ్ నానో కాంపోజిట్స్ ఫర్ హైడ్రోజన్ స్టోరేజ్’ అనే అంశంపై ఆచార్య శరత్ ప్రసంగించనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ పట్టాలు అందుకున్న ప్రొఫెసర్ శరత్ ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు. అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకున్న శరత్ చంద్రబాబును యూనివర్సిటీ యాజమాన్యం, ప్రొఫెసర్లు, అధ్యాపకులు అభినందించారు.

  • Loading...

More Telugu News