: అమెరికాపై దాడికి సంబంధించిన యానిమేటెడ్ వీడియోను విడుదల చేసిన ఉత్తరకొరియా.. మీరు కూడా చూడండి!


గువామ్ పై దాడి చేస్తామంటూ పలు సందర్భాల్లో ఉత్తరకొరియా పోస్టర్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అమెరికాపై ఉత్తరకొరియా క్షిపణులు దాడి చేస్తున్నట్టు ఆ పోస్టర్లలో ముద్రించారు. తాజాగా ఉత్తరకొరియా ఒక యానిమేటెడ్ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో గువామ్ పై దాడి ఘటనను చూపించింది. ఈ సందర్భంగా ఆ వీడియోలో 'ఒక్కదెబ్బతో అమెరికా పొగరు అణుగుతుంది, ప్రపంచంలో మేమే అధికులమనే అమెరికా మూర్ఖులు ఊహల్లో తేలియాడుతున్నారు. మా హవాంగ్-14 న్యూక్లియర్ మిస్సైల్ వారి పొగరు అణచుతుంది' అంటూ ఉత్తరకొరియా ఆ వీడియోలో పేర్కొంది.

అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధి సిలువలతో నిండిపోతుంది. పాపాత్ములైన అమెరికన్లకు నరకమే గతి అని పేర్కొంది. అమెరికాతో తలపడేందుకు ఉత్తరకొరియా సర్వసన్నద్ధంగా ఉందని ఆ దేశం ప్రకటించింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News