: రెండో కొరియన్ యుద్ధానికి సిద్ధంగా ఉండండి: సైన్యానికి ఆదేశాలు జారీ చేసిన కిమ్ జాంగ్ ఉన్
రెండో కొరియన్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కిమ్ జాంగ్ ఉన్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేస్తూనే, దక్షిణ కొరియాను హెచ్చరించారు. ఫసిఫిక్ సముద్రంలోని గువామ్ ద్వీపంపై దాడి చేస్తామని ప్రకటించిన ఉత్తరకొరియా, అమెరికా తెరవెనుక మంత్రాంగంతో నెమ్మదించింది. ఈ నేపథ్యంలో అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా చేబడుతున్న ఉల్కీ-ఫ్రీడమ్ గార్డియన్ మిలటరీ డ్రిల్ ఉత్తరకొరియాలో ఆగ్రహం రేపుతోంది.
తమను భయపెట్టేందుకే ఈ డ్రిల్ చేపడుతున్నారని ఉత్తరకొరియా భావిస్తోంది. ఈ డ్రిల్ లో 17500 మంది అమెరికన్ సైనికులు, 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొననుండగా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, కొలంబియా, డెన్మార్క్, నెదర్లాండ్, న్యూజిలాండ్ అధికారులు కూడా పాల్గొంటారని దక్షిణ కొరియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ డ్రిల్ తమను భయపెట్టేందుకేనని, అందుకే యుద్ధానికి సిధ్దంగా ఉండాలని ఉత్తరకొరియా సైన్యాన్ని సిధ్ధం చేసింది.