: సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు నేడే.. ట్రిపుల్ తలాక్‌పై తుది తీర్పు వెల్లడించనున్న రాజ్యాంగ ధర్మాసనం!


వివాదాస్పద ట్రిపుల్ తలాక్‌పై నేడు సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించనుంది. దీంతో దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రిపుల్ తలాక్ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశగా మారింది. ముస్లింలలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా కేంద్రం మాత్రం ఇది చట్ట సమ్మతం కాదని, రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తోంది.

సైరాభాను (35) అనే మహిళ ట్రిపుల్ తలాక్‌ను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చకు కారణమైంది. సైరాభానుకు అఫ్రీన్ రెహమాన్, గుల్షన్ ప్రవీణ్, ఇష్రాత్ జహాన్ అతియా సబ్రీలు తోడు కావడంతో ఈ విషయం దేశంలో పెను సంచలనంగా మారింది. వేసవిలో వరుసగా ఆరు రోజులపాటు ఈ అంశంపై వాదనలు విన్న కోర్టు, నేడు తీర్పు వెల్లడించనుంది. అయితే ఈ అంశం మత స్వేచ్ఛలో భాగమా? కాదా? అన్నది తేల్చడానికే ధర్మాసనం పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News