: ఇరుగుపొరుగుతో చైనా వ్యవహార శైలి... డ్రాగన్ మిత్ర దేశాలు, శత్రుదేశాలు ఇవే!


తన పొరుగు దేశాలతో పెద్దన్నయ్యలా వ్యవహరించాలని చూస్తున్న చైనాకు పలు దేశాలతో సరిహద్దు సమస్యలు వున్నాయి. కొన్ని దేశాలను మచ్చిక చేసుకోవడం ద్వారా దారికి తెచ్చుకుంటూ.. మరి కొన్ని దేశాలను కొరడా పట్టుకుని భయపెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దు దేశాలు, ఆ దేశాల్లో చైనా మిత్ర, శత్రు దేశాల వివరాల్లోకి వెళ్తే... చైనాకు మంగోలియా, వియత్నాం, జపాన్‌, తైవాన్‌, భారతదేశాలతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. పాకిస్థాన్ మాత్రమే చైనాకు బలమైన మిత్రదేశం. రష్యా కూడా చైనాకు మిత్రదేశమే. అయితే అది అవసరార్థ మిత్రత్వం. అమెరికాను తలవంచేలా చేయాలంటే బలమైన దేశం సపోర్ట్ కావాలి, ఈ నేపథ్యంలో చైనాతో రష్యా మైత్రిని కొనసాగిస్తోంది. రష్యా, భారత్‌ కు మిత్రదేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తర కొరియా కూడా చైనాకు మరో మిత్రదేశం.

అమెరికాను తలవంచేలా చేయాలంటే నేరుగా కాకుండా పరోక్షంగా యుద్ధం చేయాలని, తద్వారా గెలిస్తే ఆ ఘనత తనదని, ఓడితే తమకు సంబంధం లేదని వ్యూహరచన చేసిన చైనా, ఉత్తరకొరియాను రెచ్చగొట్టడం ద్వారా అమెరికాతో తన యుద్ధ కాంక్ష తీర్చుకోవాలని భావిస్తోంది. కజకిస్థాన్, లావోస్, మయన్మార్ దేశాలు కూడా చైనాతో సఖ్యంగా ఉంటుండగా, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఆప్ఘానిస్థాన్‌ లు గోడ మీద పిల్లి తరహా వైఖరితో ఉన్నాయి.

ఇందులో అఫ్ఘనిస్థాన్ తో పాటు నేపాల్, భూటాన్‌ లు భారత్ కు మిత్ర దేశాలు. దక్షిణ సముద్ర వివాదం నేపథ్యంలో వియత్నాంకు డ్రాగన్ తో సరిపడడం లేదు. ఇక తైవాన్, కంబోడియా, బ్రూనై దేశాలకు చైనా వ్యవహారంతో చిరాగ్గా ఉన్నాయి. కానీ ఈ దేశాల్లో అత్యధిక భాగం పెట్టుబడులు పెడుతూ, లేదా సరిహద్దుల్లో విన్యాసాలు చేస్తూ వాటిని భయపెట్టి చైనా దారికి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంటోంది. దక్షణ చైనా సముద్ర జలాలు పంచుకుంటున్న దేశాల్లో ఫిలిప్పీన్స్ తో పాటు మలేసియా కూడా తటస్థవైఖరి కనబరుస్తోంది.

  • Loading...

More Telugu News