: 12 రాష్ట్రాలు, 4వేల కిలోమీటర్లు.. పట్టపగలే చిమ్మ చీకట్లు.. కనువిందు చేసిన ఖగోళ అద్భుతం!


99 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికాలో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రజలు పోటెత్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అయితే ఏకంగా గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రెండు విమానాలను ఉపయోగించింది. గ్రహణ మార్గంలో అవి ప్రయాణిస్తూ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఇక అమెరికా పశ్చిమ తీరాన ఉన్న ఆరెగావ్ నుంచి తూర్పు తీరాన ఉన్న దక్షిణ కరోలినా వరకు దాదాపు 4 వేల కిలోమీటర్ల పొడవునా 12 రాష్ట్రాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించింది. మిగతా రాష్ట్రాల ప్రజలు పాక్షికంగా గ్రహణాన్ని వీక్షించారు.

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రం 9:45 గంటలకు ప్రారంభమైన గ్రహణం రాత్రి 12:28 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. అమెరికాలో 1918లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించగా ఆ తర్వాత ఇదే తొలిసారి. ఇక సంపూర్ణ సూర్యగ్రహణ మార్గంలో ఉన్న రాష్ట్రాల్లో 2.40 నిమిషాలు పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. కాగా, ‘గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్’ గా పేర్కొంటున్న ఈ గ్రహణాన్ని చిత్రీకరించేందుకు పలువురు భారతీయ ఖగోళ పరిశోధకులు అమెరికా వెళ్లారు.

  • Loading...

More Telugu News