: ఏకంగా ఏటీఎంనే ఎత్తుకుపోయిన చోరులు!


ఏటీఎం నుంచి డబ్బులు లాగేద్దామని వచ్చిన దొంగలు అది కుదరకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో జరిగిందీ ఘటన. కాన్‌వే పట్టణంలో ఓ బ్యాంకు డ్రైవ్ వే ద్వారా నగదు తీసుకునేలా ఓ ఏటీఎంను ఏర్పాటు చేసింది.  అందులోని సొమ్మును చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో అధునాత సాంకేతికతను ఉపయోగించి ఏకంగా ఏటీఎంనే లేపుకెళ్లారు. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడి సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులు భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News