: 13 రోజుల ప్రచారంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవే!


నంద్యాల ఉపఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. టీడీపీ, వైసీపీ నేతలు నంద్యాలలోనే తిష్ట వేసి మరీ, తమ ప్రచారం కొనసాగించారు. ముఖ్యంగా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన గురించి, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలపై ఓ సారి దృష్టి సారిస్తే..

చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు..

* చంద్రబాబునాయుడుని నడిరోడ్డుపై కాల్చిపారేసినా, ఉరి తీసినా తప్పులేదు
* చంద్రబాబుకు అహంకారం.. కళ్లు నెత్తిమీద కెక్కాయి
* మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, ప్రజలను మోసం చేయడం ఓ లెక్క కాదు
* దోచుకున్న డబ్బును ఓటర్లకు పంచిపెడతాడు
* ఎన్నికలు రాగానే ప్రజల కళ్లకు చంద్రబాబు గంతలు కడతాడు..హామీలతో ఇంద్రలోకం చూపిస్తాడు.

జగన్ తన గురించి తాను చెప్పుకుంది..

* నాకు ఉన్న ఆస్తి ప్రజలే
* నేను అబద్ధం ఆడను..మోసం చేయను
* మాట ఇస్తే తప్పక పోవడమే నా విశ్వసనీయత, అదే నా ఆస్తి
* చంద్రబాబులా నా దగ్గర డబ్బు,అధికారం, పోలీస్ బలగం లేదు
* ధర్మానికి-అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఈ ఉపఎన్నిక
* ఒక్క ఏడాది తర్వాత మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.

  • Loading...

More Telugu News