: తుపాకితో బెదిరించారంటూ వైసీపీ నేత కన్నబాబుపై ఫిర్యాదు!
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబుపై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. అప్పుగా తీసుకున్న రూ.50 లక్షలు చెల్లించడం లేదంటూ కన్నబాబుపై రజన్ బాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అప్పు చెల్లించాలని అడిగితే తుపాకీతో తనను బెదిరించినట్టు ఆ ఫిర్యాదులో రజన్ బాబు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.