: ఇష్టంలేని పెళ్లి చేయడంతో.. ఇంట్లోంచి వెళ్లి మూడు రోజులు రైలులోనే తిండి తిప్పలు లేకుండా గడిపిన యువతి!
తనకు ఇష్టంలేని పెళ్లి చేయడంతో గుజరాత్ లోని సూరత్ కు చెందిన దివ్య (20) అనే యువతి అత్తింట్లోంచి పారిపోయి పోర్ బందర్ - ముంబై సౌరాష్ట్ర జనతా ఎక్స్ ప్రెస్ రైలును ఎక్కేసింది. ఆ తరువాత ఏం చేయాలో తెలియక ఆ రైలులోనే మూడు రోజులు ఉండిపోయింది. ఈ మూడు రోజులూ నీళ్లు తాగడం తప్ప ఏమీ తినకపోవడంతో ఆమె స్మృహ తప్పి పడిపోయింది. ఆమెను గుర్తించిన రైల్వే పోలీసులు మహారాష్ట్రలోని బోయిసర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించి చికిత్స అందించారు.
తనను తన భర్త, ఆడపడుచులు, అత్తమామలు వేధిస్తున్నారని దివ్య తెలిపింది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు ఆమె తల్లితో కూడా మాట్లాడారు. మరోవైపు తన భార్య కనిపించడం లేదని దివ్య భర్త సూరత్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దివ్య భర్తకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.