: రిలయన్స్ జియోకు పోటీగా రూ.299కే టీటెల్ ఫోన్!
దాదాపు ఉచితంగానే అందిస్తున్నామంటూ రిలయన్స్ జియో 4జీ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, ఆ ఫోన్‌కు పోటీగా టీటెల్ అనే స్వదేశీ కంపెనీ రూ.299కే ఫోన్ విడుదల చేయనుంది. ఇందులోని ఫీచర్లు బయటకు వచ్చాయి. 1.44 మోనో క్రోమ్ డిస్ప్లే, 650 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, సింగిల్ సిమ్‌కార్డు, టార్చ్ లైట్, ఎఫ్‌ఎం రేడియో, స్పీకర్, వైబ్రేషన్ మోడ్ ఇందులో ఉన్నాయి. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.