: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే తెలుగుజాతికి గుర్తింపు వచ్చింది!: సీఎం కేసీఆర్
ఇటీవలే భారత ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడికి ఈ రోజు తెలంగాణ సర్కారు సన్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాకముందు తెలుగువారు ఎవరయినా ఢిల్లీకి వెళితే వారిని మద్రాసీలు అనేవారని కేసీఆర్ తెలిపారు. కానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని అన్నారు. తెలుగుబిడ్డ అయిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కావడం తెలుగువాళ్లకి, తెలుగు భాషకు లభించిన గౌరవమని వ్యాఖ్యానించారు. మన భాష ప్రత్యేకతను చాటడంతో వెంకయ్య నాయుడు దిట్టని కేసీఆర్ పేర్కొన్నారు.