: బోడి గుండు ఎవ‌రికి అవుతుందో చూద్దాం?: బోండా ఉమాపై రోజా ఫైర్


ఎల్లుండి జరగనున్న నంద్యాల ఉపఎన్నికలో తమ పార్టీ ఓటమి పాలైతే తాను గుండు గీయించుకుంటానని, వైసీపీ ఓడిపోతే రోజా గుండు గీయించుకుంటారా? అని టీడీపీ నేత బోండా ఉమామ‌హేశ్వ‌రరావు స‌వాలు విసిరిన విష‌యం తెలిసిందే. ఆయ‌న స‌వాలుపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. బోండా ఉమాకి చంద్రబాబు పాలనపై అంత నమ్మకముందా? అని రోజా ప్ర‌శ్నించారు. టీడీపీ డబ్బులిచ్చి కొనుక్కున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ఆమె స‌వాలు విసిరారు. అలాచేస్తే బోడి గుండు ఎవరికి అవుతుందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News