: `ప‌ద్మావ‌తి` సినిమా కోసం హాలీవుడ్ అవ‌కాశాన్ని వ‌దిలేసుకున్న దీపికా?


సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `ప‌ద్మావ‌తి` చిత్రంలో బిజీగా ఉండ‌టంతో హాలీవుడ్‌లో ఓ పెద్ద సంస్థ నుంచి వ‌చ్చిన అవ‌కాశాన్ని దీపికా ప‌దుకునే వ‌దిలేసుకున్న‌ట్లు స‌మాచారం. `ట్రిపుల్ ఎక్స్: జాండ‌ర్ కేజ్‌` సినిమాతో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన దీపిక, త‌ర్వాత‌ మ‌రో హాలీవుడ్ సినిమాకు ఒప్పుకోలేదు. `రామ్‌లీలా`, `బాజీరావు మ‌స్తానీ` చిత్రాల త‌ర్వాత దీపికా, ర‌ణ్‌వీర్‌లు `ప‌ద్మావ‌తి` చిత్రంలో జంట‌గా న‌టిస్తున్నారు. ఇందులో షాహిద్ క‌పూర్ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ర‌ణ్‌వీర్ `అల్లాఉద్దీన్ ఖిల్జీ`గా, షాహిద్ ప‌ద్మావ‌తి భ‌ర్త `ర‌త‌న్ సింగ్‌`గా న‌టిస్తున్నారు. కాగా, గ‌తంలో కూడా సంజ‌య్‌లీలా భ‌న్సాలీ చిత్రం కోసం `ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌` చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని దీపికా కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News