: ముగిసిన నంద్యాల ఉపఎన్నికల ప్రచార పర్వం
ఈ రోజు సాయంత్రంతో నంద్యాల ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఉపఎన్నికల్లో పోటీ పడుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజుల పాటు కొనసాగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు, మాటల తూటాలతో నంద్యాల నియోజకవర్గం వేడెక్కిపోయింది. కాగా, ఈ నెల 23న నంద్యాల ఉపఎన్నిక జరగనుండగా, 28న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.