: ట్రంప్ ట్వీట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్... విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌లో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఆయన్ని విమర్శలపాలు చేస్తోంది. ట్వీట్‌లో ఒకే తప్పిదాన్ని రెండు సార్లు చేయడం వల్ల నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చార్లసెట్‌విల్లే ఘటనపై అమెరికానుద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్ `హీల్` అనే పదం స్పెల్లింగ్ తప్పుగా రాశారు. దీంతో ట్వీట్ అర్థం మారిపోయింది.
దీంతో `మన అధ్యక్షుడు ఇడియట్`, `హీల్ స్పెల్లింగ్ రాని నీవు రేపు యుద్ధం వస్తే న్యూక్లియర్ కోడ్‌లను ఎలా ఎంటర్ చేస్తావ్!` వంటి కామెంట్లతో పాటు ఆయనను అనుకరిస్తూ తప్పుడు పదాలతో చాలా మంది ట్వీట్ చేశారు. తర్వాత కాసేపటికి ట్రంప్ తన ట్వీట్‌ను సరిచేసుకున్నారు. గతంలో కూడా డిక్షనరీలో లేని `కౌఫెఫె` పదాన్ని ట్రంప్ ట్వీట్ చేశాడు. దాని అర్థం ఏంటో తెలియక నెటిజన్లు అయోమయానికి గురై, కామెంట్ల వర్షం కురిపించారు.