: ఆ కాలనీని అందుకే ఖాళీ చేయిస్తున్నారా?: ఏపీ ప్రభుత్వానికి ఎంపీ చిరంజీవి లేఖాస్త్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు ఎంపీ, సినీనటుడు చిరంజీవి ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు తిరుపతి 18వ వార్డులోని స్కావెంజర్స్ కాలనీని ఖాళీ చేయిస్తుండడంపై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కాలనీని ప్రభుత్వం ఖాళీ చేయించడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఆయన ఆరోపించారు. తిరుపతి నడిబొడ్డున ఆ కాలనీ ఉండడం ఇష్టంలేకే ఖాళీ చేయిస్తున్నారని, ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారని ఆయన ప్రభుత్వానికి రాసిన లేఖలో విమర్శించారు.