: నాలుగేళ్ల పాటు మూగబోనున్న చారిత్రాత్మక లండన్ బిగ్ బెన్ గడియారం.... మరమ్మతులే కారణం!
లండన్ పార్లమెంట్ వెస్ట్‌మినిస్టర్ భవనం వద్ద ఎలిజబెత్ టవర్ మీద ఉన్న చారిత్రాత్మక బిగ్ బెన్ గడియారం 2012 వరకు మూగబోనుంది. రోజంతా ప్రతి పావుగంటకు ఒకసారి గంటలు మోగించే ఈ గడియారాన్ని మరమ్మతులు చేయడానికి నాలుగేళ్ల పాటు గంటలు మోగించే విభాగాన్ని తొలగించనున్నారు. తీవ్ర చర్చోపచర్చల తర్వాత 157 ఏళ్ల చరిత్ర గల ఈ గడియారాన్ని 2021 వరకు గంటలు మోగే విభాగాన్ని తొలగించే నిర్ణయం తీసుకున్నారు.
అలాగే పాతకాలం నుంచి వస్తున్న పనితీరును కూడా తొలగించి, మరమ్మతులు జరిగే వరకు ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో గడియారాన్ని పనిచేయించనున్నారు. దీంతో సమయాన్ని సరిగా చూపించే అవకాశం కలుగుతుంది. అలాగే కొత్త సంవత్సరం, రిమెంబరెన్స్ సండే రోజుల్లో మాత్రం గంటలు మోగిస్తుందని బ్రిటన్ పార్లమెంట్ అధికారులు తెలిపారు. ఇక చివరి సారి బిగ్‌బెన్ గడియారం మోగించే గంటలు వినడానికి చాలా మంది అక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే మరమ్మతులు జరుగుతున్నంత కాలం అక్కడికి పర్యాటకులను వెళ్లకుండా అడ్డుకోనున్నారు.