: ఒక్క‌టైన ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం.. ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ


త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి త‌రువాత ఎన్నో నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య‌ ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాలుగా చీలిపోయిన అన్నాడీఎంకే పార్టీ మ‌ళ్లీ ఈ రోజు ఒక్క‌టైంది. ఈ రోజు సీఎం ప‌ళ‌నిస్వామితో ప‌న్నీర్ సెల్వం చెన్నైలోని అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్యాల‌యంలో భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ భేటీ అనంత‌రం ఇరు వ‌ర్గాల విలీనంపై ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రోవైపు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు ముంబ‌యి నుంచి చెన్నై చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ప‌ళ‌నిస్వామి మంత్రివ‌ర్గంలో ప‌న్నీర్ సెల్వంతో పాటు మ‌రికొంత మంది నేత‌లు చేర‌నున్నారు. పార్టీ మార్గ‌ద‌ర్శ‌క క‌మిటీకి కూడా ప‌న్నీర్ సెల్వం ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు.  

  • Loading...

More Telugu News