: వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్ మేనల్లుడు!


నంద్యాల ఉపఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్న తరుణంలో ఆసక్తికర విషయాలు జరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్ మేనల్లుడు, హరుత్ మోటార్స్ అధినేత ముస్తాక్ ఈరోజు వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆయన్ని జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముస్తాక్ ను పలువురు అభినందించారు. ఇదిలా ఉండగా, నంద్యాలలోని రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ అధినేత రామకృష్ణారెడ్డి వైసీపీకి మద్దతు ప్రకటించారు.

  • Loading...

More Telugu News