: బాలకృష్ణ కొత్త సినిమా ట్రైలర్ కి అరకోటి వ్యూస్!
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన 101వ చిత్రం ‘పైసా వసూల్’ ట్రైలర్‌కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ ట్రైలర్‌లో ప్రధానంగా ఓ బార్‌లో బాలయ్య చేస్తోన్న ఫైట్లు, చెప్పిన డైలాగులను చూపించారు. బాలయ్య చేస్తోన్న డ్యాన్స్ కూడా అభిమానులను అలరిస్తోంది. దీంతో ఈ ట్రైలర్ అప్పుడే 50 లక్షల వ్యూస్‌ని దాటిపోయింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తనదైన శైలిలో రూపొందించిన సీన్లు ఈ ట్రైలర్‌ను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. ఈ సినిమాను వచ్చేనెల 1న విడుదల చేయనున్నారు. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలోనే ఈ థియేట్రికల్ ట్రైలర్ ను పూరీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే.