: బిడ్డకు జన్మనిచ్చి....లిఫ్ట్ లో ఇరుక్కుపోయి.. ముక్కలైన తల్లి!


పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లి లిఫ్ట్ లో నలిగి ముక్కలైపోయిన అత్యంత దారుణమైన ఘటన స్పెయిన్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...దక్షిణ స్పెయిన్‌ లోని సీవిల్లే ప్రాంతానికి చెందిన రోషియోనునేజ్ అనే మహిళ నెలలు నిండడంతో పురుడు కోసం అదే ప్రాంతంలో ఉన్న వాల్మే హాస్పిటల్‌ లో చేరింది. ఆమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

 ప్రసవం అనంతరం ఆమెను స్ట్రెచర్ పై లిఫ్ట్ లో పై అంతస్తులోని వార్డు రూంకి తీసుకెళ్తున్నారు. ఇంతలో ఆమెను తీసుకెళ్తున్న లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. వెంటనే నర్సులు తలుపులు తీసుకుని లిప్ట్ నుంచి బయటపడగా, బయటకు రావడానికి ప్రయత్నించిన బాలింత లిఫ్ట్ తలుపు మధ్యలో ఇరుక్కుపోయింది. ఇంతలో తలుపు బలంగా మూసుకుపోవడంతో రోషియోనునేజ్ రెండు ముక్కలైపోయి, ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. 

  • Loading...

More Telugu News