: అదుపుతప్పి దూసుకెళ్లిన కాంగ్రెస్ ఎంపీ కాన్వాయ్.. ముగ్గురి మృతి
బీహార్‌లోని సుపాల్స్ నియోజకవర్గ ఎంపీ, కాంగ్రెస్ నేత రంజీత్ రంజాన్ కాన్వాయ్ ఒక్కసారిగా అదుపుతప్పి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నిర్మలి-సికార్హట మెయిన్ రోడ్డుపై చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్న నిర్మలి బ్లాక్ చీఫ్ రామ్ ప్రశేష్ యాదవ్ గాయాలపాలయిన వారిని కారులో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.