: అనుమానంతో భార్యను చంపిన భర్త!
కడపలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను చంపేసి తమ నలుగురు చిన్నారులను తల్లిలేని బిడ్డల్ని చేశాడు. రాజశేఖర్, ఆదిలక్షమ్మ దంపతులది జిల్లాలోని సిద్దవటం మండలంలోని భాకరాపేట. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి బిడ్డలంతా 6 ఏళ్లలోపు వారే. రాజశేఖర్ కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డ్‌గా పనిచేస్తున్నాడు. రాజశేఖర్ ప్రతిరోజు తాగి వచ్చి తన భార్యను హింసించేవాడు. ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ కొట్టేవాడు. నిన్న తన భార్యతో మరోసారి గొడవపడిన రాజశేఖర్.. ఆమెను ఇంట్లోనే కొట్టి చంపేశాడు. అనంతరం పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.